Page Loader
ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే 
ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే

ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే 

వ్రాసిన వారు Stalin
May 11, 2023
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెబల్ స్టార్ ప్రభాస్, పొడుగుకాళ్ల సుందరి దీపికా హీరోహీరోయిన్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ డ్రామా 'ప్రాజెక్ట్ K'. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను 2024, జనవరి 12 విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ K షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్ పక్కటెముక, బొటనవేలుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అమితాబ్ చికిత్స పొందుతున్నారు. అమితాబ్ కోలుకోవడం ఆలస్యం అవుతుండటంతో సినిమా పనులు ముందటపడటం లేదు.

సినిమా

అమితాబ్ పూర్తిగా కోలుకున్నాకే షూటింగ్ ప్రారంభించే యోచనలో యూనిట్

ఒక వేళ అమితాబ్ గాయాల నుంచి కోలుకున్నా, ఆయన యువ ఆర్టిస్టులతో పోటీపడి షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. బిగి బీది ఈ సినిమాలో కీలక పాత్ర కావడంతో ఆయన పూర్తిగా కోలుకున్నాకే షూటింగ్ ప్రారంభించాలని చిత్రీకరణను నిరవధికంగా వాయిదా వేశారు. బచ్చన్ షూటింగ్‌లో పాల్గొనడానికి ఎంత సమయం పడుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదని, అయితే ఈ విషయంలో దర్శకుడు (నాగ్ అశ్విన్), నిర్మాతలు (వైజయంతీ మూవీస్) తొందరపడటం లేదని చిత్ర బృందం తెలిపింది. షూటింగ్‌ని తిరిగి ప్రారంభించే విషయంపై బచ్చన్‌సాబ్‌పై ఒత్తిడి తీసుకురావడం లేదని, ఆయన కోసం వేచి చూస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సినిమా విడుదల తేదీని మళ్లీ నిర్ణయించే అవకాశం ఉందని చిత్రబృందం పేర్కొంది.