Page Loader
ప్రభాస్ 'ప్రాజెక్టు కె' టీ షర్టు ఉచితం.. ఎలా పొందాలంటే!
ప్రభాస్ 'ప్రాజెక్టు కె' టీ షర్టు ఉచితం.. ఎలా పొందాలంటే!

ప్రభాస్ 'ప్రాజెక్టు కె' టీ షర్టు ఉచితం.. ఎలా పొందాలంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 09, 2023
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌వరల్డ్ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో 'ప్రాజెక్టు కె' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటి దిగ్గజ ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ముఖ్యంగా విష్ణుముర్తి అవతారమైన కల్కి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే జులై 20న కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న 'శాన్ డియాగో కామిన్-కాన్ 2023' వేడకలో 'ప్రాజెక్టు కె' సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని తెలియజేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో 'ప్రాజెక్టు కె' సంబంధిత టీషర్ట్స్ ను అభిమానుల కోసం ఉచితంగా మేకర్స్ అందజేయనున్నారు.

Details

ట్విట్టర్ అకౌంట్ నుంచి లింక్ ను షేర్ చేసిన వైజయంతి మూవీస్

'ప్రాజెక్టు కె' అంటే ఏమిటి? అని రాసి ఉన్న టీషర్ట్ పొందడానికి వైజయంతి మూవీస్ ట్విటర్ అకౌంట్ నుంచి ఓ లింక్ ను షేర్ చేసింది. ఆ లింక్ పై క్లిక్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుతోంది. ఆ విండో పసుపు రంగులో ఉంటే కంటన్యూ బటన్ కానీ, వైజయంతి మూవీస్ లోగో పైనా కానీ ప్రెస్ చేయాలి. అప్పుడు పేరుతో పాటు ఈమెయిల్ ని పొందుపరిస్తే మీకు కావాల్సిన సైజ్ లో టీషర్ట్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది. ఫస్ట్ డ్రాప్ పేరుతో శనివారం లింక్ విడుదల చేయగా 4 నిమిషాల్లోనే సేల్ అయినట్లు తెలిపారు. నేడు సెకండ్ డ్రాప్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది