Prabhas : 'సలార్' విజయంపై డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ రెస్పాన్స్ ఇదే.. ఏమన్నారంటే
సలార్ సక్సెస్ పై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ మాట్లాడగా మొదటిసారిగా మూవీ విజయంపై మాట్లాడాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమా గతవారం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్ 1 సీజ్ ఫైర్ టాకీసుల్లో భారీ విజయం సాధించింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మరోసారి కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు. సలార్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 178.7 కోట్ల గ్రాస్ అందుకుని సరికొత్త రికార్డు సెట్ చేయగా ఇప్పటివరకు దాదాపు రూ.600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
సలార్ -2 కోసం ఎదురుచూపులు షురూ
ఈ మేరకు థియేటర్లలో సలార్ సందడి ఇప్పటికీ కొనసాగుతోంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్స్, సక్సెస్ రావడంతో డార్లింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్నుంచే బాహుబలి 1 తర్వాత పార్ట్ 2 కోసం ఎదురు చూసినట్లు సలార్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్ సినిమాలోని ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్'లో పోస్ట్ చేసిన ప్రభాస్.. నేను ఖాన్సార్ భవిష్యత్'ను నిర్ణయించేటప్పుడు మీరు రిలాక్స్'గా కూర్చొని కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేయండన్నారు. సలార్ సీజ్ ఫైర్ ని ఇంత పెద్ద సక్సెస్ చేసి, సినిమాని మీ సొంతం చేసుకున్నందుకు థ్యాంక్స్ డార్లింగ్స్ అని పోస్ట్ చేశాడు. దీంతో ప్రభాస్ పోస్ట్ నెట్టింట వైరల్'గా మారింది.