Page Loader
Prabhas SalaarMovie Review: ప్రభాస్ 'సలార్' మూవీ Review.. ఇంట్రెస్ట్‌గా సాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా!
ప్రభాస్ 'సలార్' మూవీ Review.. ఇంట్రెస్ట్‌గా సాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా!

Prabhas SalaarMovie Review: ప్రభాస్ 'సలార్' మూవీ Review.. ఇంట్రెస్ట్‌గా సాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2023
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas), దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం 'సలార్'. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించడం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎప్పట్నుంచో ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్ అతృతుగా ఎదురుచూస్తున్నారు. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం. ఖన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజ మన్నార్ (జగపతిబాబు) రాజు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. అయితే రాజమన్నార్ తన కొడుకు వరద రాజమన్నార్( పృథ్వీరాజ్ సుకుమార్‌న్) ని దొరగా చూడాలనుకుంటాడు. ఈ క్రమంలో వరద రాజమన్నార్ పై దాడులు జరుగుతుంటాయి.

Details

అంచనాలకు తగ్గట్టుగానే సలార్

ఇలాంటి పరిస్థితుల్లో సాయం కోసం తన చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్) ను వరద పిలుస్తాడు. అయితే తన స్నేహితుడు కోసం దేవా ఎలాంటి యుద్ధం చేశాడు?అసలు దేవా ఎవరు? అతని తండ్రి ఎవరో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. కుర్చీ కోసం జరిగే పోరాటంలో ఫ్రెండ్‌కు ప్రభాస్ ఇచ్చిన విలువను సలార్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే, హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో నూ చాలా బాగా ఆకట్టుకుంది. ఎలివేషన్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కథని నడిపించాడు. ద్వితీయార్థంలో కాస్త గందరగోళంగా అనిపిస్తోంది. ప్రభాస్-శ్రుతి హాసన్ మధ్య సాగే సీన్స్ ను అద్భుతంగా తీశారు.

Details

తన పాత్రకు ప్రాణం పోసిన పృథ్వీరాజ్

ముఖ్యంగా ప్రభాస్-పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే సీన్స్ కూడా మెప్పిస్తాయి. పృథ్వీరాజ్ తన పాత్రకు ప్రాణం పోశాడు. నటి ఈశ్వరీరావుకి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దొరికింది. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులను బోరు కొట్టిస్తాయి. మొత్తం మీద ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుందనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ సినిమా ఆడియన్స్‌ను చాలా బాగా ఆలరిస్తుంది.