LOADING...
Prabhas: ప్రభాస్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. కొత్త దర్శకుల కోసం నూతన అవకాశాలు
ప్రభాస్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. కొత్త దర్శకుల కోసం నూతన అవకాశాలు

Prabhas: ప్రభాస్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. కొత్త దర్శకుల కోసం నూతన అవకాశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ ఈ ఏడాదీ సినిమాలో బిజీ షెడ్యూల్‌తో ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఆయన త్వరలో 'ది రాజాసాబ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత ఏడాది ప్రభాస్ కొత్త రచయితలకు, డైరెక్టర్స్‌కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుని, తన అన్న ప్రమోద్ తో కలిసి "ది స్క్రిప్ట్ క్రాఫ్ట్" సంస్థను స్థాపించాడు. ప్రభాస్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా, మంచి కథలు ఉన్నవారు ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్‌సైట్‌లో తమ కథలు లేదా సినాప్సిస్ అప్లోడ్ చేయాలని, అవకాశం లభిస్తుందని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ప్రభాస్ తన సంస్థ ద్వారా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నాడని వీడియో ద్వారా షేర్ చేసాడు.

Details

ప్రభాస్ నిర్మాణ సంస్థలో డైరెక్టర్ అయ్యే అవకాశం పొందవచ్చు

ఈ వీడియోలో ప్రముఖ డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి మాట్లాడుతూ, కొత్త దర్శకులు ఈ కాంటెస్ట్‌లో పాల్గొని భవిష్యత్తులో ప్రభాస్ నిర్మాణ సంస్థలో డైరెక్టర్ అయ్యే అవకాశం పొందవచ్చని సూచించారు. ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో ఎవరైనా పాల్గొనవచ్చు. మీ షార్ట్ ఫిల్మ్‌లు బాగుంటే, మంచి కథలుంటే మీరు కూడా అవకాశాన్ని పొందవచ్చు. కాంటెస్ట్‌లో చేరడానికి ఈ లింక్ ద్వారా రిజిస్టర్ కావాలి: [https://www.thescriptcraft.com/register/director](https://www.thescriptcraft.com/register/director). ప్రభాస్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా మీ సినిమా ట్యాలెంట్‌ను బయటకు తీసి, భవిష్యత్తులో డైరెక్టర్‌గా ఎదగడానికి గల అవకాశాన్ని ఉపయోగించండి.

Advertisement