Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో మరింత వేగాన్ని పెంచుతున్నాడు. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిన ఆయన, 2026లో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఒకవైపు 'ఫౌజీ', మరోవైపు 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌పై ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయని సమాచారం. మిగిలిన షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి, దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని యోచిస్తున్నాడు. దీనికోసం దర్శకుడు హను రాఘవపూడి షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు.
వివరాలు
వరుస షెడ్యూల్స్‌తో బిజీ బిజీ
ఇదిలా ఉండగా, 2026లో రెండో సినిమాను కూడా విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రభాస్ ముందుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఆయన నటించిన 'ది రాజాసాబ్' ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఇక 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు ఇప్పటికే తమ భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ కూడా త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో చేరనున్నాడని సమాచారం. ఇందులో ఆయన పోషించే కర్ణుడి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
వివరాలు
విడుదలకు రెడీ అవుతున్న సినిమాలు..
మరోవైపు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఒక శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై, గోవాలో ఇతర నటీనటులతో ఒక షెడ్యూల్ పూర్తయ్యిందని తెలుస్తోంది. ప్రభాస్ కూడా త్వరలో ఈ షూటింగ్‌లో పాల్గొననున్నాడని సమాచారం. భారీ ప్రాజెక్టులతో రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రభాస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది 'ఫౌజీ' విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే 2027 మార్చి 5న 'స్పిరిట్' సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వీటితో పాటు 'సలార్ 2' కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో ఉంది.