Prabhudeva Son : కొడుకును గ్రాండ్‌గా పరిచయం చేసిన ప్రభుదేవా.. ఇద్దరు కలిసి స్టేజ్‌పై డ్యాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
డ్యాన్స్ మాస్టర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభు దేవా, తన అద్వితీయమైన డ్యాన్స్‌తో స్టార్ హీరోలను మెప్పించి, చిన్న వయస్సులోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు.
డ్యాన్స్ మాస్టర్‌గా కొనసాగుతూనే, నటుడు, దర్శకుడు, నిర్మాతగా సినీ రంగంలో బిజీ అయ్యారు. ఆయన తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు కూడా డ్యాన్స్ మాస్టార్లే కావడం విశేషం.
తాజాగా ప్రభుదేవా తన వారసుడు రిషి దేవాను అందరికీ పరిచయం చేశారు. ఆయన మొదటి భార్య లతా నుండి ముగ్గురు పిల్లలు ఉండగా, వారిలో ఒకరు క్యాన్సర్‌తో మృతిచెందారు.
రెండో భార్య హిమానితో ఆయనకు ఒక కూతురు ఉంది. తాజాగా రిషి దేవాను గ్రాండ్‌గా ఇంట్రడ్యూస్ చేశారు.
Details
వైబ్ ఈవెంట్‌లో తండ్రి-కొడుకు స్టేజ్‌పై డ్యాన్స్
చెన్నైలో తొలిసారిగా 'వైబ్' అనే లైవ్ డ్యాన్స్ కాన్సర్ట్ నిర్వహించిన ప్రభుదేవా, కొన్ని గంటల పాటు తన టీంతో కలిసి పలు పాటలకు అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఈ ఈవెంట్‌కు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యేకంగా తండ్రి-కొడుకులు కలిసి డ్యాన్స్ చేసిన ఈ అపూర్వ సందర్భం అందరినీ ఆకట్టుకుంది.
ఈ ఘటనను ప్రభుదేవా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రిషి దేవాను పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని, తామిద్దరి తొలిసారిగా స్టేజ్ షేర్ చేసుకున్నామని చెప్పారు.
ఇది కేవలం డ్యాన్స్ కాదని, వారసత్వం, ప్యాషన్‌తో ఈ ప్రయాణం మొదలైందంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.