LOADING...
Prakash Raj : 'వారణాసి'లో ప్రకాశ్ రాజ్ పాత్ర రిలీవ్
'వారణాసి'లో ప్రకాశ్ రాజ్ పాత్ర రిలీవ్

Prakash Raj : 'వారణాసి'లో ప్రకాశ్ రాజ్ పాత్ర రిలీవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీ రాజన్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఇదే చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి మాట్లాడుతూ ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో నేను వారణాసిలోని ఒక మహా శివభక్తుడిగా కనిపిస్తాను. పాత్ర ఎంతో ఆధ్యాత్మికతతో, శక్తివంతంగా ఉంటుంది. మహేశ్‌కు తండ్రిగా నటిస్తున్నానని తెలిపారు. వారణాసి నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రకాష్ రాజ్ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందని సమాచారం.

Details

వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్

తెలుగు తెరపై తండ్రి-కొడుకుల భావోద్వేగాలకు ప్రతీకగా మహేశ్ బాబు-ప్రకాష్ రాజ్ జంట ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. గతంలో వీరి కలయికలో వచ్చిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ఇప్పుడు 'వారణాసి'తో ఈ హిట్ కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. మరోసారి తండ్రి-కొడుకులుగా వీరు కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'వారణాసి' చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement