Page Loader
Prakashraj: పవన్‌ కళ్యాణ్‌పై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు!
పవన్‌ కళ్యాణ్‌పై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు!

Prakashraj: పవన్‌ కళ్యాణ్‌పై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు ప్రకాష్ రాజ్‌ (Prakash Raj) ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాతీయ అవార్డులు, రాజకీయాలు, వివాదాస్పద అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించిన ఆయన, పవన్‌ రాజకీయ తీరు గురించి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్‌ కళ్యాణ్ ప్రజా సమస్యల గురించి చురుకుగా మాట్లాడారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన సమయంలో రాజకీయ వ్యాఖ్యలు చేసి సమయం వృథా చేయడం ఏమిటని ప్రశ్నించారు. "ఇది సినిమా కాదు.. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Details

గతంలోనూ ప్రకాశ్ రాజ్ విమర్శలు

తిరుపతి లడ్డూ వివాదంపై కూడా ఆయన స్పందించారు. తాను సనాతన ధర్మానికి వ్యతిరేకి కాదని స్పష్టం చేసిన ఆయన, ఇది సున్నితమైన అంశమని, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సూచించారు. లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ జరిగితే బాధ్యులను వెంటనే శిక్షించాలన్నారు. ఇదే మొదటిసారి కాకుండా, ప్రకాశ్‌ రాజ్‌ గతంలోనూ పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్‌ కూడా వాటికి స్పందించారు. ప్రకాశ్‌ రాజ్‌ తనకు మిత్రుడే అయినా, వివాదాస్పద అంశాలపై అంత దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.