Page Loader
Pratinidhi 2: నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ రిలీజ్.. కాంట్రవర్సీని టచ్ చేసిన దర్శకుడు

Pratinidhi 2: నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ రిలీజ్.. కాంట్రవర్సీని టచ్ చేసిన దర్శకుడు

వ్రాసిన వారు Stalin
May 08, 2024
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

నారా రోహిత్ కాస్త గ్యాప్ తర్వాత 'ప్రతినిధి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.సీఎంను ఎందుకు చంపావు అంటూ మొదలైన ట్రైలర్​లో నారా రోహిత్​ను మొదట ఒక జర్నలిస్టుగా చూపించారు. పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి మూవీ సామాజిక సమస్యలపై పోరాడితే 'ప్రతినిధి-2' రాజకీయ సమస్యలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని తెలిసేలా తెరకెక్కించారు. ఈ మూవీలో నారా రోహిత్​తో పాటు రఘుబాబు, ఇంద్రజ, తనికెళ్ళ భరణి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటింటారు. కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని కలిసి ఈ చిత్రాన్ని రానా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.

Details 

సమైఖ్య ఆంద్రప్రదేశ్​లో జరిగిన యధార్ధ ఘటన

ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలు మూర్తి దేవగుప్తపు తీసుకోగా సంగీతం మహతి స్వర సాగర్ అందించారు. 15 ఏళ్ల క్రితం సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ​లో జరిగిన యధార్ధ ఘటనలను గుర్తు చేసే సీన్స్ కొన్ని ట్రైలర్​లో కనిపిస్తాయి. అసలే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఎన్నికల వేడిలో మండిపోతున్నాయి. ఇప్పుడు విడుదలైన 'ప్రతినిధి 2' ట్రైలర్ ఆ వేడిని ఇంకాస్త పెంచేలా ఉంది. ట్రైలర్​లోనే కాస్త కాంట్రవర్సీని టచ్​ చేసినట్లు కనిపిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్