
వచ్చే ఏడాది ప్రతినిధి 2 రిలీజ్.. ప్రశ్నించడానికి మళ్లీ వస్తున్న నారా రోహిత్
ఈ వార్తాకథనం ఏంటి
వరుస పరాజాయాలతో హీరో నారా రోహిత్ ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. చాలా రోజులగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నాడు.
ప్రస్తుత రాకీయాలే కథాంశంగా నారా రోహిత్ హీరోగా 'ప్రతినిధి 2' సినిమా తెరకెక్కనుంది. జర్నలిస్టు మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ ని మూవీ యాజమాన్యం విడుదల చేసింది.
బాడీ మొత్తం న్యూస్ పేపర్లు, రాష్ట్రంలో హాట్ టాపిక్ బ్యానర్ ఐటెమ్ లతో కూడిన న్యూస్ పేపర్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ చాలా కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్ని అకట్టుకుంటోంది.
Details
జనవరి 25న ప్రతినిధి 2 రిలీజ్
మూర్తి అద్భుతమైన స్క్రిప్టును సిద్ధం చేశారని, షూటింగ్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది.
మొదట నారా రోహిత్ నటించిన ప్రతినిధి సినిమా సూపర్ హిట్ అయింది. రోహిత్ కెరీర్ లోనే ఈ మూవీ పెద్ద హిట్ గా నిలిచింది. దానికి సీక్వెల్ గా ప్రతినిధి 2 మూవీని తెరకెక్కించబోతున్నారు.
ఇక తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో ' ఓ వ్యక్తి మళ్లీ అన్ని అసమానతలకు వ్యతిరేకంగానిలబడతాడు' అనే క్యాప్షన్ ఇచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రతినిధి 2 గురించి నారా రోహిత్ చేసిన ట్వీట్
Here is a sneak peek of my next, #Prathinidhi2. @murthyscribe has crafted an outstanding script, and I'm eagerly looking forward to start filming this one.
— Rohith Nara (@IamRohithNara) July 24, 2023
Jan 25th, 2024 Release.@SagarMahati @NChamidisetty @actorkumarraza @TSAnjaneyulu1 @VanaraEnts pic.twitter.com/LAW6kBTew9