LOADING...
NBK111: బాలయ్య కొత్త సినిమాకు సన్నాహాలు.. లొకేషన్లు పరిశీలిస్తున్న గోపీచంద్ మలినేని 
బాలయ్య కొత్త సినిమాకు సన్నాహాలు.. లొకేషన్లు పరిశీలిస్తున్న గోపీచంద్ మలినేని

NBK111: బాలయ్య కొత్త సినిమాకు సన్నాహాలు.. లొకేషన్లు పరిశీలిస్తున్న గోపీచంద్ మలినేని 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో మరో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో రూపొందిన 'వీరసింహ రెడ్డి'తో సూపర్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని, ఈసారి బాలయ్యతో పూర్తిగా భిన్నమైన ప్రయోగానికి సిద్ధమయ్యాడు. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. NBK111 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా రెండు వేర్వేరు కాలాలకు చెందిన కథతో హిస్టారికల్ నేపథ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం.

Details

తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల పరిశీలన

చరిత్రను, వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీగా ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒకరకంగా టైమ్ ట్రావెల్ తరహా కథతో, బాలయ్యను ఇప్పటివరకు చూడని విధంగా పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారట. ఇటీవల అఖండ 2 షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీగా ఉన్న బాలయ్య త్వరలోనే గోపీచంద్ మలినేని సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బాలయ్యపై లుక్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. మరోవైపు లొకేషన్ల ఎంపిక కోసం రెక్కీ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు.

Details

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ చెబుతున్నారు. టెక్నికల్ టీమ్ విషయంలోనూ ఎక్కడా రాజీ పడడం లేదని సమాచారం. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా కాంతారకు పని చేసిన అర్వింద్ కశ్యప్‌ను ఎంపిక చేశారు. అలాగే బాలయ్యకు ఆస్థాన సంగీత దర్శకుడిగా పేరున్న తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొత్తం మీద బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఈ సినిమా మరో భారీ విజయం సాధిస్తుందనే అంచనాలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి.

Advertisement