LOADING...
Mana Shankara Vara Prasad Garu:'మన శంకర వర ప్రసాద్ గారు' రిలీజ్ డేట్‌పై రేపే ప్రెస్‌మీట్.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ 
'మన శంకర వర ప్రసాద్ గారు' రిలీజ్ డేట్‌పై రేపే ప్రెస్‌మీట్.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ

Mana Shankara Vara Prasad Garu:'మన శంకర వర ప్రసాద్ గారు' రిలీజ్ డేట్‌పై రేపే ప్రెస్‌మీట్.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' కోసం సినీప్రేమికులు, మెగా అభిమానులు భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన 'మీసాల పిల్ల', 'శశిరేఖ' పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో, సినిమాపై అంచనాలను మరింత పెరిగాయి. మేకర్స్ ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేసారని తెలిసిన విషయం. అయితే, తాజా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, సినిమా విడుదల తేదీపై అధికారిక అప్‌డేట్ త్వరలో ప్రకటించనున్నారు. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, నిర్మాతలు జనవరి 12, 2026న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్లాన్ చేస్తున్నారు.

Details

రేపే అధికారిక ప్రకటన

ఈ సినిమాలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారని, అలాగే కేథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ప్రత్యేక ఆకర్షణగా విక్టరీ వెంకటేష్ పవర్‌ఫుల్ అతిథి పాత్రలో ఉంటున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగా అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రేపు స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించి, రిలీజ్ డేట్‌పై అధికారిక వివరాలు ప్రకటించనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.

Advertisement