Loading...
Chiranjeevi: డీప్‌ఫేక్‌లు, ఏఐ మోసాలను అడ్డుకోండి.. కేంద్రానికి చిరంజీవి విజ్ఞప్తి
డీప్‌ఫేక్‌లు, ఏఐ మోసాలను అడ్డుకోండి.. కేంద్రానికి చిరంజీవి విజ్ఞప్తి

Chiranjeevi: డీప్‌ఫేక్‌లు, ఏఐ మోసాలను అడ్డుకోండి.. కేంద్రానికి చిరంజీవి విజ్ఞప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ మోసాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశం అనంతరం.. ఆయన సూచన మేరకు కిషన్ రెడ్డికి వినతిపత్రం అందించినట్లు చిరంజీవి తాజాగా సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలను అడ్డుకునేందుకు కఠినమైన రక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించిన కిషన్ రెడ్డికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు

ప్రతి పౌరుడి భద్రను పరిరక్షించాలి

సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ విషయాలను ముందుకు తీసుకెళ్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

కళాకారుల గౌరవం, వ్యక్తిగత గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడటంతోపాటు ప్రతి పౌరుడి భద్రతను పరిరక్షించడం అందరి బాధ్యత అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

అమిత్‌షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ

నవంబర్ 2న చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై ఆయనతో చర్చించారు.

తమ ఆందోళనలను అమిత్‌షా అర్థం చేసుకున్నారని, ప్రభుత్వం ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి మరిన్ని చర్యలు, కఠినమైన శిక్షలు ప్రవేశపెట్టే దిశగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారని అప్పట్లో చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ADVERTISEMENT