LOADING...
Narendra Modi Biopic : ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్.. టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్.. టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే?

Narendra Modi Biopic : ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్.. టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలికాలంలో భారత సినిమా పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ భారీగా నడుస్తోంది. స్వతంత్ర సమరయోధులు, క్రీడా రంగంలో పేరొందిన ప్లేయర్స్, ప్రముఖ గాయకులు, నటీమణులు, అంతేగాక పలువురు మాజీ ముఖ్యమంత్రులు వంటివారి జీవిత గాథలను ప్రదర్శిస్తూ, పెద్ద తెరపై బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్స్ గా నిలవగా, మరికొన్ని బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి. ఇంకా కొన్ని బయోపిక్‌లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు, తాజా ప్రాజెక్ట్‌గా, భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత ప్రయాణాన్ని ప్రదర్శించే బయోపిక్ రూపొందించేందుకు ప్రణాళికలు చేపట్టారు. ఇప్పటికే నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా గతంలో 'పీఎం నరేంద్ర మోదీ ' అనే బయోపిక్ వచ్చింది.

వివరాలు 

'మా వందే'గా టైటిల్ ఫిక్స్

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్రలో నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈసారి,సినిమాను భారీ బడ్జెట్‌తో,అధునాతన టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని నిర్మాతలు లక్ష్యం పెట్టుకున్నారు. ముఖ్యంగా,మలయాళం స్టార్ హీరో ఉన్నిముకుందన్ నటించబోతున్నాడు.'జనతా గ్యారేజ్', 'భాగమతి','యశోద'వంటి సూపర్ హిట్ తెలుగు సినిమాలలో నటించిన ఉన్ని ముకుందన్,ఈసారి భారత ప్రధాని నరేంద్రమోదీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా దర్శకత్వ బాధ్యత క్రాంతి కుమార్ సిహెచ్ స్వీకరించగా,భారీ హిట్ సినిమాలైన బాహుబలి డివోపి కేకే సెంథిల్,'KGF'మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ సినిమా అధికారికంగా 'మా వందే'అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్