Loading...
Priyanka Chopra Malti Anaconda: అనకొండతో ఆడుకుంటున్న ప్రియాంక ముద్దుల పట్టి.. ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్
అనకొండతో ఆడుకుంటున్న ప్రియాంక ముద్దుల పట్టి.. ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్

Priyanka Chopra Malti Anaconda: అనకొండతో ఆడుకుంటున్న ప్రియాంక ముద్దుల పట్టి.. ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 25, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కుమార్తె మాల్తీ మేరీ చేసిన ఓ సాహసం ఇప్పుడు సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆస్ట్రేలియాలోని ఓ జూను సందర్శించిన సమయంలో మాల్తీ భారీ అనకొండను ఏమాత్రం భయపడకుండా తాకింది. పక్కనే జూ సిబ్బంది ఉండగా, చిన్నారి ఎంతో ఆసక్తిగా పామును నిమిరింది. ఈ దృశ్యాలను చూసిన ప్రియాంక.. తన కుమార్తె ఎంతో ధైర్యవంతురాలని మురిసిపోయారు. ఆ క్షణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి.

Details

జంతువులతో మాల్తీ సందడి.. తల్లితో కలిసి ప్రత్యేక పర్యటన

ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఆస్ట్రేలియాలో తన హాలీవుడ్‌ చిత్రం 'ది బ్లఫ్‌' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

షూటింగ్‌కు కాస్త విరామం దొరకడంతో తన తల్లి మధు చోప్రా, కుమార్తె మాల్తీతో కలిసి జూను సందర్శించారు.

అనకొండను చూడటంతో ఆగకుండా మాల్తీ అక్కడి కంగారూలు, జిరాఫీలతోనూ సందడి చేసింది.

ముఖ్యంగా భారీ పామును ధైర్యంగా తాకిన దృశ్యం ప్రియాంకకు ప్రత్యేకంగా అనిపించింది.

కూతురి ఆసక్తి, తెగువను దగ్గరుండి చూసిన ఆమె ఆ అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Details

స్టీవ్‌ ఇర్విన్‌ను గుర్తు చేసుకున్న ప్రియాంక

ఈ పర్యటనకు సహకరించిన హాలీవుడ్‌ నటుడు రస్సెల్‌ క్రోకు, తమను ఆప్యాయంగా ఆహ్వానించిన ఇర్విన్‌ కుటుంబానికి ప్రియాంక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా దివంగత వన్యప్రాణి సంరక్షకుడు స్టీవ్‌ ఇర్విన్‌ను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.

జూలో అడుగుపెట్టినప్పటి నుంచి జంతువుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, అంకితభావం ప్రతి చోటా కనిపించిందని భావోద్వేగానికి లోనయ్యారు.

మాల్తీతో గడిపిన ఈ చిన్న పర్యటన తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని ప్రియాంక పేర్కొన్నారు.

ADVERTISEMENT