Dhurandhar 2: విడుదలకు ముందే సమస్యలు.. 'ధురంధర్ 2' షూటింగ్‌పై అక్కడ బ్యాన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ మూవీ 'ధురందర్ 2' అనూహ్య సమస్యలు తలెత్తాయి. ఈ చిత్రానికి ముంబయిలో షూటింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకూడదని, అంతేకాకుండా దీనిపై బ్యాన్ విధించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ నిర్ణయం షూటింగ్ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముంబయిలో చిత్రీకరణకు అనుమతి కోసం నిర్మాణ సంస్థ దరఖాస్తు చేసుకున్నప్పటికీ, మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు నిరాకరించింది. అదేవిధంగా, ఈ చిత్రంపై శాశ్వత నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
Details
మార్చి 19న రిలీజ్
గతంలో ముంబయిలో షూటింగ్ నిర్వహించిన సమయంలో చిత్రబృందం నిబంధనలను ఉల్లంఘించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఇటీవల ముంబయిలోని పలు వీధుల్లో జరిగిన షూటింగ్‌లో క్రాకర్లు, మండే పదార్థాలు ఉపయోగించారని, అది అనుమతి షరతులకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. ఈ కారణాల వల్లే తాజా అనుమతులను తిరస్కరించినట్లు తెలిపారు. దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో, హీరోగా రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ గతేడాది చివర్లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'ధురంధర్: ది రివెంజ్' పేరుతో రెండో భాగం రానుంది. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.