Producer Anji Reddy : ఆస్తుల కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీపరిశ్రమలో ఘోరం చోటు చేసుకుంది. ఈ మేరకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురవడం ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది.
స్థిరాస్తుల వ్యవహారంలో జీఆర్ కన్వెన్షన్స్ (GR CONVENTIONS) యజమాని రవి కాట్రగడ్డ, నిర్మాత అంజిరెడ్డిని దారుణంగా హత మార్చాడని పోలీసులు గుర్తించారు.
డీమార్ట్(కమర్షియల్ కాంప్లెక్స్)లోని బేస్మెంట్ 2 సెల్లార్ పార్కింగ్ లో ఇద్దరు బీహారీలతో చేతులు కలిపిన రవి, నిర్మాత అంజిరెడ్డి హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
నిర్మాత పేరుతో ఉన్న పలు భవనాలను ధ్వంసం చేసేందుకు రవి కాట్రగడ్డ ఈ హత్యకు పూనుకున్నట్లు పేర్కొన్నారు.
DETAILS
హత్యకు ముందు ఆస్తులన్నీ తన పేరిట రాయించుకున్న రవి కాట్రగడ్డ
నిర్మాత అంజిరెడ్డి పేరిట ఉన్న ఆస్తులు, పలు భవనాలను వశపర్చుకునేందుకు రవి కాట్రగడ్డ, హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తేల్చారు.
అంతకుముందు నిర్మాత అంజిరెడ్డి తన పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించేసి, అమెరికాలోనే స్థిరపడాలని భావించారు.
ఈ మేరకు తన ఆస్తులను అమ్మి పెట్టే బాధ్యతను నిర్మాత అంజిరెడ్డి, రవి కాట్రగడ్డకు అప్పగించారు. ఈ తరుణంలోనే స్థిరఆస్తులపై కన్నేసిన రవి, ఏకంగా యజమాని అంజిరెడ్డి హత్యకు బిహారీలతో కలిసి కుట్ర పన్నారు.
హత్యకు ముందు ఆస్తులను రవి, తన పేరిట రాయించుకుని నిర్మాతను హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ క్రమంలోనే నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.