Page Loader
Mega 157: 'మెగా 157' లీక్స్‌పై నిర్మాణ సంస్థ హెచ్చరిక.. చట్టపరమైన చర్యలు ఇవే!
'మెగా 157' లీక్స్‌పై నిర్మాణ సంస్థ హెచ్చరిక.. చట్టపరమైన చర్యలు ఇవే!

Mega 157: 'మెగా 157' లీక్స్‌పై నిర్మాణ సంస్థ హెచ్చరిక.. చట్టపరమైన చర్యలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2025
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం Mega157 వర్కింగ్ టైటిల్స్‌తో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం కేరళ పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. అయితే తాజా షెడ్యూల్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ కీలక సన్నివేశాన్ని కొందరు అనధికారికంగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవడంతో చిత్ర బృందం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఈ విషయంలో స్పందించిన నిర్మాణ సంస్థ 'మా సినిమాకు సంబంధించిన కొన్ని ఫుటేజ్‌లు, ఫొటోలు అనధికారికంగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇవి మాకు తెలిసి బాధ కలిగించాయి.

Details

వీడియోలు షేర్ చేయొద్దు

మా అనుమతి లేకుండా సెట్స్‌లో ఏదైనా కంటెంట్‌ను రికార్డు చేయడం చట్ట విరుద్ధం. ఇలాంటి చర్యలు చిత్ర బృందానికి తీవ్ర ఇబ్బందులను కలిగించడంతో పాటు షూటింగ్‌కు అంతరాయం కలిగించేలా ఉన్నాయి. ఈ సినిమాపై ఎంతో ప్రేమ, శ్రమతో పని చేస్తున్న మా టీమ్‌ను దెబ్బతీయడం మాకు బాధ కలిగిస్తోంది. కనుక ఈ విషయంలో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేయొద్దని కోరుతున్నాం. అధికారిక సమాచారం వచ్చినప్పుడు మాత్రమే అది తెలుసుకోవాలని పేర్కొంది.

Details

వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్

ఈ సినిమా ఒక కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోంది. చిరంజీవి సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి ఈ చిత్రంలో తన అసలు పేరు శంకర్ వరప్రసాద్‌గా నటిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకు 'మన శివ శంకర్ వరప్రసాద్ గారు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే, ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.