
ప్రాజెక్ట్ కె: అమెరికాలో ప్రభాస్ అభిమానుల కార్ ర్యాలీ; కార్లతో ప్రాజెక్ట్ కె లోగో
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
అమెరికాలోని శాని డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో గ్లింప్స్ లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
ఆ ఉత్సాహాన్ని కార్ ర్యాలీ రూపంలో చూపించారు. అమెరికా రాష్ట్రం మిస్సోరిలో కార్ ర్యాలీని నిర్వహించిన అభిమానులు, ప్రాజెక్ట్ కె లోగోను కార్లతో రూపొందించారు. ఈ వీడియోను వైజయంతీ మూవీస్ విడుదల చేసింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పఠాని నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రభాస్ అభిమానుల కార్ ర్యాలీ
A BIG shoutout to the amazing Rebel Star #Prabhas fans from St. Louis, USA🇺🇸 for organizing the #ProjectK Car Rally!💥
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).#WhatisProjectK @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/ssHM6s2kgk