LOADING...
Parasakthi Movie: 'పరాశక్తి'కి నిరసన సెగ.. సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్.. ఏం జరుగుతోంది? 
'పరాశక్తి'కి నిరసన సెగ.. సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్.. ఏం జరుగుతోంది?

Parasakthi Movie: 'పరాశక్తి'కి నిరసన సెగ.. సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్.. ఏం జరుగుతోంది? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'పరాశక్తి' మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో రవి మోహన్ (జయం రవి), అధర్వ మురళి కీలక పాత్రల్లో నటించగా, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తొలుత పాన్ ఇండియా రిలీజ్‌గా విడుదల చేయాలనుకున్నప్పటికీ, చివరకు ఈ మూవీ కేవలం తమిళ్ వెర్షన్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల కొరత కారణంగా తెలుగు వెర్షన్ విడుదల కూడా నిలిచిపోయింది.

Details

1960ల హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యం.. కంటెంట్‌పై విమర్శలు

1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంతో పాటు అప్పటి సామాజిక-రాజకీయ సంఘటనల ఆధారంగా 'పరాశక్తి' సినిమాను తెరకెక్కించినట్లు దర్శకురాలు సుధా కొంగర పేర్కొన్నారు. అయితే సినిమా ప్రారంభం నుంచే కథా విషయంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చారిత్రక సంఘటనలను తప్పుదోవ పట్టించేలా చూపించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా విడుదల అనంతరం ఈ నిరసనల తీవ్రత మరింత పెరిగింది.

Details

సినిమాను నిషేధించాలి: తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్

తాజాగా తమిళనాడు యూత్ కాంగ్రెస్ 'పరాశక్తి' సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. యూత్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, 'పరాశక్తి' సినిమాను తప్పనిసరిగా నిషేధించాలి. ఇందులో చరిత్రను తప్పుదోవ పట్టించే అనేక సన్నివేశాలు ఉన్నాయి. శివ కార్తికేయన్ పాత్ర ఇందిరాగాంధీని కలిసిన సన్నివేశాలు పూర్తిగా చిత్ర బృందం ఊహాశక్తితో రూపొందించినవే. చరిత్రలో జరగని సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. వాస్తవ సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి. క్లైమాక్స్‌లోనూ వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయి. వీటిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Details

మొదటి నుంచే వివాదాల నడుమ 'పరాశక్తి'

'పరాశక్తి' సినిమా మొదటి నుంచే ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. మొదట టైటిల్ వివాదం, ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికెట్, అనంతరం ట్రైలర్‌పై విమర్శలు.. ఇలా పలు అంశాల్లో ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఏకంగా సినిమాను నిషేధించాలనే డిమాండ్ రావడం సినిమా చుట్టూ ఉన్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ అంశంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Advertisement