పొన్నియన్ సెల్వన్ 2: మణిరత్నం పాదాలను తాకిన ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్
మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషనలో భాగంగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో, ఆ సినిమాలో నటించిన స్టార్స్ అందరూ హాజరయ్యారు. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, జయం రవి, ఇంకా సినిమా దర్శకుడు మణిరత్నం.. తమ సినిమా గురించి మాట్లాడారు. ముందుగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ, దర్శకులు చాలా స్వార్థపరులు. వాళ్ళు వాళ్ల సినిమాకు ఏం కావాలో దానికోసమే ఆలోచిస్తారు. నాకు ఐశ్వర్యా రాయ్ అంటే ఎంత ఇష్టం ఉన్నా, నా సినిమాలో తనకు సూట్ అయ్యే పాత్ర ఉన్నప్పుడు మాత్రమే ఆమెను అడుగుతాను. నేను అడిగినప్పుడల్లా తను ఎస్ అంటుందని ఐశ్వర్య గురించి గొప్పగా మాట్లాడాడు. ఈ మాటలు విన్న వెంటనే, గౌరవ సూచకంగా మణిరత్నం పాదాలను తాకింది ఐశ్వర్య.
ఇరువార్ సినిమాతో ఐశ్వర్యా రాయ్ కు బ్రేక్ ఇచ్చిన మణిరత్నం
మణిరత్నం రూపొందించిన చాలా సినిమాల్లో ఐశ్వర్యా రాయ్ కనిపించింది. పొలిటికల్ డ్రామా అయిన ఇరువార్ అనే తమిళ చిత్రంతో ఐశ్వర్యా రాయ్ కి బ్రేక్ ఇచ్చాడు మణిరత్నం. ఆ తర్వాత రావణ్, గురు, పొన్నియన్స్ సెల్వన్ వంటి సినిమాల్లో కనిపించింది. అదలా ఉంచితే, ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లోనూ ప్రీ రీలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు హాజరైన ఐశ్వర్యా రాయ్, తెలుగులో రెండు ముక్కలు మాట్లాడింది. పొన్నియన్ సెల్వన్ మొదటి భాగానికి తమిళనాడులో తప్ప ఇతర భాషల్లో పెద్దగా వసూళ్ళు రాలేదు. మరి ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవబోతున్న పొన్నియన్ సెల్వన్ 2, బాక్సాఫీసు వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.