Loading...
Puri jagannadh: పూరీ జగన్నాథ్ ఇంట విషాదం.. తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్‌తో మనసు విప్పిన పవిత్ర
పూరీ జగన్నాథ్ ఇంట విషాదం.. తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్‌తో మనసు విప్పిన పవిత్ర

Puri jagannadh: పూరీ జగన్నాథ్ ఇంట విషాదం.. తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్‌తో మనసు విప్పిన పవిత్ర

వ్రాసిన వారు Moogati Shabari
Jul 27, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబాన్ని తీవ్ర విషాదం ఆవరించింది. ఆయన తల్లి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషాద వార్తను పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన భావోద్వేగ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పలువురిని కదిలిస్తోంది. తన నానమ్మతో ఉన్న ఆత్మీయ బంధాన్ని గుర్తు చేసుకుంటూ పవిత్ర ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమెతో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకున్నారు. ఆ చిత్రానికి జత చేసిన సందేశంలో తన మనసులోని బాధను హృదయాన్ని హత్తుకునేలా వ్యక్తం చేశారు.

వివరాలు

విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్న పూరీ..

"ఇక నుంచి నన్ను 'చిన్నతల్లి' అని ఎవరు పిలుస్తారు? ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకునేది ఎవరు? నీతో మరో రోజు గడిపే అవకాశం దొరికితే ఎంత బాగుండేది.

నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లే మరోసారి నిన్ను గట్టిగా హత్తుకోవాలనిపిస్తోంది.

నానమ్మా... నిన్ను చాలా మిస్ అవుతున్నాను" అంటూ పవిత్ర తన ఆవేదనను పంచుకున్నారు.

పవిత్ర చేసిన ఈ పోస్టు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా పూరీ జగన్నాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే, దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

వివరాలు

పూరీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..

ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పూరీ కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి.

అయితే సినిమా పనుల్లో నిమగ్నమైన ఈ సమయంలో పూరీ జగన్నాథ్ కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం సినీ పరిశ్రమను కూడా కలచివేసింది.

అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పూరీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ADVERTISEMENT