
Duniya Vijay: బాలకృష్ణ సినిమాలో విలన్ గుర్తింపు పొందిన నటుడికి పూరీ జగన్నాథ్ ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని హీరోగా, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్‌కు కీలక పాత్రలో అవకాశం దక్కింది.
ఈ విషయాన్ని స్వయంగా పూరీ ఒక ఫోటోను షేర్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. కన్నడ పరిశ్రమలో దునియా విజయ్ మంచి గుర్తింపు పొందారు.
తెలుగు ప్రేక్షకులకు ఆయన 'వీరసింహారెడ్డి' సినిమాలో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్ర ద్వారా బాగా పరిచయం అయ్యారు.
బాలకృష్ణతో చేసిన ఈ చిత్రంలో ఆయన నటనకి మంచి ప్రశంసలు వచ్చాయి. గతంలో కూడా టాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వచ్చినా అప్పట్లో ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అవి వదులుకోవాల్సి వచ్చింది.
Details
ప్రచారంలో 'బెగ్గర్' అనే టైటిల్
కానీ 'వీరసింహారెడ్డి' విజయంతో తెలుగు పరిశ్రమలో మరోసారి తన దృష్టిని ఆకర్షించారు.
ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందించనున్న 'బెగ్గర్' (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో దునియా విజయ్ కీలక పాత్ర పోషించనున్నారు.
ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించనున్నారు.
చిత్రీకరణను జూన్‌లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాతో టాలెంటెడ్ నటి టబు దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
Details
ప్రత్యేక పాత్రలో టబు
కేవలం ప్రత్యేకమైన పాత్రలకే ఒప్పుకుంటానని చెప్పే టబు, ఈ సినిమాలో తన పాత్ర ఎంతో వైవిధ్యంగా, బలంగా ఉంటుందని వెల్లడించారు.
అదేసమయంలో రాధికా ఆప్టే కూడా ఈ సినిమాతోనే తిరిగి టాలీవుడ్‌లోకి రావనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ మల్టీస్టారర్ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం.
పూరీ జగన్నాథ్ ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో ఓ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.