
Puri Jagannadh: విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా ఖరారు.. షూటింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు టాలీవుడ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో తన స్థాయిని కోల్పోయాడు.
అయినా అతని అభిమానులు మాత్రం పూరీ గట్టిగా కమ్‌బ్యాక్ ఇస్తాడని ఎదురుచూస్తున్నారు. చివరకు, ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల నుండి వినిపిస్తున్న వార్తలే నిజమయ్యాయి. తమిళ స్టార్ విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ కొత్త సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
ఛార్మితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని, ఐదు భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఉగాది సందర్భంగా ఫోటో విడుదల చేసి వెల్లడించారు.
Details
పుకార్లకు చెక్ పెట్టిన పూరీ
ఈ ప్రకటనతో పూరీ జగన్నాథ్ పలు విషయాల్లో స్పష్టత ఇచ్చినట్లయింది.
గత కొంతకాలంగా పూరీ-ఛార్మి విడిపోతున్నారని వస్తున్న రూమర్స్‌కు చెక్ పడింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్‌ల కారణంగా బయ్యర్లు పూరీ తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో ఇక పూరీ నిర్మాతగా సినిమాలు తీయడం మానేస్తాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
విజయ్ సేతుపతి సినిమాను కూడా పూరీ-ఛార్మి కాంబినేషన్‌లో నిర్మించడంతో ఆ పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది.