Page Loader
Allu Arjun: శరవేగంగా పుష్క-2 షూటింగ్.. కాకినాడకు బన్నీ వస్తున్నాడు
శరవేగంగా పుష్క-2 షూటింగ్.. కాకినాడకు బన్నీ వస్తున్నాడు

Allu Arjun: శరవేగంగా పుష్క-2 షూటింగ్.. కాకినాడకు బన్నీ వస్తున్నాడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2024
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం చిత్ర బృందం షూటింగ్‌ను బ్రేక్‌ లేకుండా వేగంగా పూర్తి చేస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 'పుష్ప 2'కు సంగీతాన్ని అందిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ రెండు విభాగాలుగా జరుగుతోంది.

Details

కాకినాడలో కీలక ఛేజింగ్ సీన్స్

సుకుమార్ టీమ్స్‌ని ఏర్పాటు చేసి, ఒక టీం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తుండగా, మరొక టీం కాకినాడలో కీలక ఛేజింగ్ సీన్స్‌ని తెరకెక్కిస్తోంది. అల్లు అర్జున్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో తన షూటింగ్ పూర్తిచేసుకొని, ఇప్పుడు కాకినాడకు వెళ్లనున్నాడు. కాకినాడలో అల్లు అర్జున్‌పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. జాతర పాట సహా, ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉన్నట్లు తెలిసింది. ఈ పాటల షూటింగ్ అక్టోబర్‌లో పూర్తవ్వాలని యూనిట్ భావిస్తుంది. అక్టోబర్ చివరి నాటికి షూటింగ్ మొత్తం ముగించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.