
Pushpa 2: అల్లు అర్జున్ 'పుష్ప 2' విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్.
ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్సె,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో మెప్పిస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈసినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది,అయితే దాని విడుదల వాయిదా పడింది.
ఈ విషయాన్ని చిత్ర హీరో అల్లు అర్జున్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించాడు. సోమవారం సాయంత్రం,అల్లు అర్జున్ తన X పేజీలో పుష్ప 2: ది రూల్ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇదే..
#Pushpa2TheRule in cinemas from December 6th, 2024. pic.twitter.com/BySX31G1tl
— Allu Arjun (@alluarjun) June 17, 2024
వివరాలు
తొలి భాగానికి అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు
అందులో "డిసెంబర్ 6, 2024 నుండి థియేటర్లలో #Pushpaa2Rule" అని రాసి ఉంది.
'పుష్ప 2: ది రూల్' సుకుమార్ 2021 తెలుగు బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్'కి డైరెక్ట్ సీక్వెల్.
ఫహద్ ఫాసిల్ మొదటి భాగం చివరిలో షెకావత్ గా కనిపించారు. దీనికి సీక్వెల్‌గా రానున్న రెండో పార్ట్‌లో ఆయన క్యారెక్టర్ ఎక్కువ సేపు ఉంటుందని అంటున్నారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమాకి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.