
Pushpa 2: పుష్ప సినిమా నుండి మే1న సెన్సేషనల్ సర్ప్రైజ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
మరి ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే మొదటి సాంగ్ తాలూకా ప్రోమోని రిలీజ్ చేశారు.
అయితే, ఇప్పుడు మేకర్స్ పూర్తి పాటను మే 1, 2024న బహుళ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.
కాగా, దీనికి సంబంధించి లేటెస్ట్ గా ఓ సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ అందించారు.
Details
మేకర్స్ ఇవ్వనున్న సర్ప్రైజ్ ఏంటి?
ఈ ఫస్ట్ సింగిల్ వచ్చే లోపే ఒక సెన్సేషనల్ సర్ప్రైజ్ ని అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
దీనితో ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. మరి ఇది పాటకి సంబంధించినదా లేక ఇతర అంశమా అనేది వేచి చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
We said it.
— Mythri Movie Makers (@MythriOfficial) April 25, 2024
You did it.#PushpaPushpa is resonating all over 🔥
May 1st @ 11.07 AM ❤🔥
Before the full song, stay tuned for a sensational surprise 💥💥
Stay tuned! pic.twitter.com/m0SAHvC5cU