LOADING...
Allu Arjun: ఓవర్సీస్‌లో విడుదలకు ముందే 'పుష్ప-2' సెన్సేషన్ రికార్డు
ఓవర్సీస్‌లో విడుదలకు ముందే 'పుష్ప-2' సెన్సేషన్ రికార్డు

Allu Arjun: ఓవర్సీస్‌లో విడుదలకు ముందే 'పుష్ప-2' సెన్సేషన్ రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'పుష్ప 2'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలుగా నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ వ్యవహరిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా, శ్రీలీల ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇక ఓవర్సీస్‌లో డిసెంబరు 4న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన ఘనతను సాధించారు.

Details

అత్యంత వేగంగా అడ్వాన్స్ బుకింగ్స్

ఇప్పటికే ఓవర్సీస్‌ బుకింగ్స్‌ను ప్రారంభించగా, పుష్ప-2 అత్యంత వేగంగా 500K అడ్వాన్స్‌ సేల్స్‌ సాధించి, ఆల్‌ టైమ్‌ ఇండియన్‌ సినిమాగా రికార్డు సృష్టించింది. టికెట్‌ బుకింగ్స్‌లోనూ పుష్ప రాజ్‌ ప్రభావం చూపిస్తూ, USA లో కేవలం ప్రీమియర్స్‌ కోసం 20,000 పైగా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ సాధించి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ సినిమా విడుదల నాటికి 4 మిలియన్లకు పైగా అడ్వాన్స్‌ రూపంలో రాబడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసి, పాన్ ఇండియా ప్రమోషన్స్‌ను మేకర్స్ చేపట్టనున్నారు.