Page Loader
Pushpa 2: పుష్ప - 2 ట్రైలర్ లో సగం గుండుతో కనిపించిన నటుడు ఎవరంటే?
పుష్ప - 2 ట్రైలర్ లో సగం గుండుతో కనిపించిన నటుడు ఎవరంటే?

Pushpa 2: పుష్ప - 2 ట్రైలర్ లో సగం గుండుతో కనిపించిన నటుడు ఎవరంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రూల్' చిత్ర ట్రైలర్ ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా విడుదలైంది. బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. సినిమాపై మరింత హైప్ 2 నిమిషాల 48 సెకన్ల నిడివి గల ట్రైలర్‌లో దర్శకుడు సుకుమార్ కథకు సంబంధించిన వివరాలను పెద్దగా వెల్లడించకపోయినప్పటికీ, అల్లు అర్జున్ పాత్రకు అత్యంత శక్తివంతమైన ఎలివేషన్ ఇచ్చారు. దీని వల్ల సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి.

వివరాలు 

అరగుండు క్యారెక్టర్ హైలైట్ 

ట్రైలర్‌ చూసిన నెటిజన్లు ప్రధాన నటులు అల్లు అర్జున్, రష్మిక మంధాన, ఫహాద్ ఫాజిల్, శ్రీలీలలను మాత్రమే కాకుండా, ఒక అరగుండు పాత్రపై ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారు. "ఎవరు ఈ అరగుండు? ఇతని గురించి తెలుసుకోవాలి!"అంటూ గూగుల్‌లో శోధనలు మొదలుపెట్టారు. కొద్ది క్షణాలు మాత్రమే కనిపించిన ఆ క్యారెక్టర్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అతనిపై మీమ్స్, జోక్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ నుండి పుష్ప వరకు తారక్ పొన్నప్ప ఈ అరగుండు క్యారెక్టర్‌కి సంబంధించిన నటుడు తారక్ పొన్నప్ప.ఆయన శాండల్‌వుడ్(కన్నడ సినీ పరిశ్రమ)కి చెందినవారు. యశ్‌ నటించిన'కేజీఎఫ్'లో కనిపించిన పొన్నప్ప,ఈ ఏడాది విడుదలైన ఎన్టీఆర్ 'దేవర పార్ట్-1'లో కూడా నటించారు.కానీ సైడ్ క్యారెక్టర్స్‌ వల్ల పెద్దగా గుర్తింపు పొందలేదు.

వివరాలు 

సినిమా విడుదలకు ముందు వేడుకలు 

అయితే, 'పుష్ప: ది రూల్' ట్రైలర్‌లో అతని విలక్షణమైన రూపం, భీకరమైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. తారక్ పొన్నప్ప తెలిపిన ప్రకారం, ఈ సినిమా కథలో కీలక మలుపుగా అతని పాత్ర ఉంటుందట. 'పుష్ప: ది రూల్' ఈ ఏడాది డిసెంబరు 5న విడుదల కానుంది. విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఆరు నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించనుంది. చివరిగా హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక ఈవెంట్ జరగనుంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఈవెంట్లు ప్లాన్ చేయలేదు.

వివరాలు 

వైల్డ్ ఫైర్ 

ఈ సీక్వెల్‌లో అనసూయ, సునీల్‌తో పాటు జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ వంటి కొత్త నటులు చేరారు. శ్రీలీల ఓ ప్రత్యేక పాటలో నటించగా, అల్లు అర్జున్ చెప్పిన "పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా? కాదు, వైల్డ్ ఫైర్" అనే డైలాగ్ యూట్యూబ్‌లో నూతన రికార్డులను సృష్టిస్తోంది. 'పుష్ప: ది రూల్' ట్రైలర్ అభిమానులను ఊర్రూతలూగించడమే కాకుండా, సినిమాపై భారీ అంచనాలను సెట్ చేసింది. ఈ చిత్రం విడుదల రోజున ప్రేక్షకుల హృదయాలను మరింతగా కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.