Pupshpa 2: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ప్రభంజనం.. రెండో రోజు రూ.400 కోట్ల వసూళ్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి మరోసారి తన నటనతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఇప్పుడు పుష్ప 2: ది రూల్ తో మరొక భారీ విజయాన్ని అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. తొలిరోజే ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ. 175 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లు వసూలు చేసింది. రెండో రోజుకు ఇది మరింతగా పెరిగి, దేశవ్యాప్తంగా రూ. 265 కోట్లకు చేరుకుంది.
వసూళ్లు మరింత పెరిగే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండో రోజు రూ. 400 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తన నటన, శక్తివంతమైన మ్యానరిజం, యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రష్మిక మందన్న కూడా తన పాత్రలో మెప్పించారు. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నెగిటివ్ పాత్రలో నటించడంతో సినిమా మరింత ఆకట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగిపోతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.