Loading...
Ramayana: 'పుష్ప 2' రికార్డుకు చెక్.. 'రామాయణం' మ్యూజిక్ హక్కులకు రూ.75 కోట్ల ఆఫర్!
'పుష్ప 2' రికార్డుకు చెక్.. 'రామాయణం' మ్యూజిక్ హక్కులకు రూ.75 కోట్ల ఆఫర్!

Ramayana: 'పుష్ప 2' రికార్డుకు చెక్.. 'రామాయణం' మ్యూజిక్ హక్కులకు రూ.75 కోట్ల ఆఫర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో 'రామాయణం' ఒకటి. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు ముందే ఈ సినిమా మరో సంచలన వార్తతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ మ్యూజిక్ హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ ఏకంగా రూ.75 కోట్లకు సొంతం చేసుకుందనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వివరాలు

రూ.75 కోట్ల మ్యూజిక్ డీల్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే అతిపెద్దదా?

అందుతున్న సమాచారం ప్రకారం, టీ సిరీస్ 'రామాయణం' చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ హక్కులను రూ.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

ఈ ఒప్పందంలో సినిమా రెండు భాగాల మ్యూజిక్ హక్కులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ మొత్తం అడ్వాన్స్ రూపంలోనే చెల్లించినట్లు సమాచారం.

ఈ వార్త నిజమైతే భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద మ్యూజిక్ రైట్స్ డీల్ ఇదే అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

'పుష్ప 2' రికార్డుకు బ్రేక్?

ఇప్పటి వరకు 'పుష్ప 2' మ్యూజిక్ హక్కులు సుమారు రూ.65 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్తలు వినిపించాయి.

అయితే 'రామాయణం'కు రూ.75 కోట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం రావడంతో ఆ రికార్డును కూడా ఈ చిత్రం అధిగమించినట్టే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా విడుదలకు ముందే ఇలాంటి భారీ వ్యాపారం జరగడం, ఈ ప్రాజెక్ట్‌పై మార్కెట్‌లో ఉన్న నమ్మకం, అంచనాలకు నిదర్శనంగా భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

హన్స్ జిమ్మర్ - ఏఆర్ రెహమాన్ మ్యాజిక్

ఈ చిత్రానికి సంగీతమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయి ఆర్కెస్ట్రేషన్‌తో పాటు భారతీయ ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించే సంగీతాన్ని ప్రేక్షకులకు అందించనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది.

ఈ కారణంగానే మ్యూజిక్ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొన్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

బ్రహ్మ ముహూర్తంలో ట్రైలర్ విడుదల

సినిమా ప్రమోషన్‌లోనూ మేకర్స్ వినూత్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లను సాయంత్రం లేదా రాత్రి విడుదల చేస్తుంటారు.

కానీ 'రామాయణం' ట్రైలర్‌ను జూలై 30న తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తమైన ఉదయం 4:15 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పవిత్రమైన సమయాన్ని ఎంచుకోవడం ద్వారా సినిమా ఆధ్యాత్మికతను ప్రేక్షకులకు మరింత బలంగా చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

భారీ తారాగణం.. ఐమ్యాక్స్‌లో విడుదల

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్‌తో పాటు సన్నీ డియోల్, రవి దూబే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానుల నుంచి విశేష స్పందన అందుకోగా, ఇప్పుడు ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT