Pushpa 2: పుష్ప 2 సన్సేషన్ రికార్డు.. ఇండియన్ సినీ చరిత్రలో అద్భుత రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబరు 4న ప్రీమియర్ షోస్‌తో ప్రారంభమైన 'పుష్ప 2: ది రూల్' ఇండియన్ బాక్సాఫీస్‌పై వసూళ్లతో కొత్త చరిత్రను లిఖించింది.
ఈ చిత్రం కేవలం 32 రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ. 1831 కోట్ల రూపాయల వసూళ్లతో, పుష్ప-2 భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది.
అంతకుముందు రూ. 1810 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన బాహుబలి-2 రికార్డును దాటేసి, కొత్త మైలురాయిని నెలకొల్పింది.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థల సంయుక్త నిర్మాణంలో రూపొందించారు.
Details
రూ.1831 కోట్ల వసూలు
విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లోనే సరికొత్త రికార్డులను సృష్టించిన పుష్ప-2, ప్రీమియర్ షో నుంచే సెన్సేషనల్ బ్లాక్బస్టర్‌గా నిలిచింది.
అల్లు అర్జున్ నటనకు, సుకుమార్ ప్రతిభాశాలి టేకింగ్‌కు ప్రపంచ సినీ ప్రియులు ముగ్ధులయ్యారు.
ఈ మూవీ 32 రోజుల్లోనే ఈ సినిమా రూ. 1831 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి, అద్భుత రికార్డును తన పేరిట రాసుకుంది.
పుష్ప-2 సాధించిన వసూళ్లను చూస్తే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో మరెన్నో కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.