
AlluArjun : పుష్ప-2 ట్రైలర్ సంచలనం.. 'గుంటూరు కారం' రికార్డు బద్దలు
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కావడంతో టాలీవుడ్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, జగపతిబాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పుష్ప-2 ట్రైలర్ విడుదలైన కేవలం 14 గంటల 52 నిమిషాల్లో టాలీవుడ్‌లో హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన ట్రైలర్‌గా నిలిచింది.
Details
12 గంటల్లో 60 మిలియన్ వ్యూస్
మహేశ్ బాబు గుంటూరు కారం ట్రైలర్ రికార్డ్ (37.68 మిలియన్ వ్యూస్) బద్దలు కొట్టి, 37.74 మిలియన్ వ్యూస్ సాధించింది.
ఇది కేవలం తెలుగు వ్యూస్ మాత్రమే, హిందీ, తమిళం, మలయాళ భాషలు కలిపి 12 గంటల్లో 60 మిలియన్ వ్యూస్ మార్కును అధిగమించింది.
ఈ ట్రైలర్ సౌత్ ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన నంబర్-1 ట్రైలర్‌గా నిలిచింది.
ఈ ట్రైలర్ విడుదలతో పుష్ప-2 పై ఆసక్తి మరింతగా పెరిగింది.