Page Loader
Pushpa 2 : బాలీవుడ్ బాక్సాఫీస్‌లో పుష్పరాజ్ నెంబర్ వన్ రికార్డు 
బాలీవుడ్ బాక్సాఫీస్‌లో పుష్పరాజ్ నెంబర్ వన్ రికార్డు

Pushpa 2 : బాలీవుడ్ బాక్సాఫీస్‌లో పుష్పరాజ్ నెంబర్ వన్ రికార్డు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2025
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 అత్యంత వేగంగా రూ.1000 కోట్లు, ఆ తర్వాత రూ.1500 కోట్లు, చివరకు రూ.1700 కోట్ల గ్రాస్‌ను దాటిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా రూ.1800 కోట్ల మార్క్‌ను టచ్ చేసి, బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ నుంచే ఈ వసూళ్లలో సగానికి పైగా రావడం విశేషం. ఇప్పటివరకు బాలీవుడ్ బడా స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ చిత్రాలు కూడా ఈ స్థాయి వసూళ్లను సాధించలేకపోయాయి. నార్త్ బెల్ట్‌లో ఇప్పటికీ భారీ ఆక్యుపెన్సీ కొనసాగుతుండడంతో, పుష్ప 2 ఇప్పటివరకు రూ.806 కోట్ల హిందీ మార్క్‌ను టచ్ చేసింది.

Details

రూ.800 కోట్లతో సంచలన రికార్డు

కేవలం 31 రోజుల్లోనే ఈ కలెక్షన్స్ సాధించి, హిందీ బాక్సాఫీస్ చరిత్రలో నంబర్ -1 చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతోపాటు హిందీ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా పుష్ప 2 కొత్త మైలురాయిని చేరుకుంది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమాలు కూడా పుష్ప 2 ప్రభంజనం ముందు నిలబడలేకపోతున్నాయి. వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నా పుష్ప 2 ప్రభావం ముందు డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం రూ.2వేల కోట్ల మార్క్‌ను చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.