Loading...
Tharun Bhascker - Eesha Rebba : రూమర్స్‌కు చెక్‌.. వినాయక చవితి వేళ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు
రూమర్స్‌కు చెక్‌.. వినాయక చవితి వేళ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు

Tharun Bhascker - Eesha Rebba : రూమర్స్‌కు చెక్‌.. వినాయక చవితి వేళ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్‌ కొంతకాలంగా హీరోయిన్‌ ఈషా రెబ్బతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి హీరోహీరోయిన్లుగా 'ఓం శాంతి శాంతిః' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. వీరి ప్రేమ మాత్రం పండిందనే ప్రచారం మొదలైంది. అంతకుముందు నుంచే మంచి పరిచయం ఉన్న తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బ.. 'ఓం శాంతి శాంతిః' సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డారని వార్తలొచ్చాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరి ప్రేమపై పలు రూమర్స్‌ వచ్చినప్పటికీ.. తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బ ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో తరుణ్‌ భాస్కర్‌ మాత్రం సమయం వచ్చినప్పుడు ఈ విషయంపై చెబుతానని పేర్కొన్నారు.

వివరాలు

సోషల్ మీడియాలో ఫోటో వైరల్

తాజాగా ఆ సమయం వచ్చినట్లే కనిపిస్తోంది. వినాయక చవితి పండగ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బ కలిసి వినాయక విగ్రహం ముందు కూర్చున్న ఫొటోను తరుణ్‌ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఈ ఫొటోతో పెళ్లికి ముందే వీరిద్దరూ కలిసి వినాయక పూజ నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇంతకాలం తమపై వచ్చిన ప్రేమ వార్తలు కేవలం రూమర్స్‌ కాదని, నిజమేనని ఈ ఫొటో ద్వారా తరుణ్‌ భాస్కర్‌ క్లారిటీ ఇచ్చినట్లైంది.

అయితే తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బ వివాహం ఎప్పుడు చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఈషా రెబ్బ ఇటీవలే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. మరోవైపు తరుణ్‌ భాస్కర్‌కు ఇది రెండో పెళ్లి కానుంది.

ADVERTISEMENT