Page Loader
పంజా వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమా గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 
గ్లింప్స్ రిలీజ్ పై క్లారిటీ

పంజా వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమా గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
May 15, 2023
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజా వైష్ణవ్ తేజ్ తన నాలుగవ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు కూడా. అంతేకాదు బీస్ట్ సినిమాలో నటించిన అపర్ణదాస్, ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. మళయాలీ నటుడైన జోజు జార్జ్ కూడా తెలుగులో ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. గతంలో వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాల మాదిరి కాకుండా, ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందట. ఈ చిత్ర గ్లింప్స్, ఈరోజు సాయంత్రం 4:05గంటలకు రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సితార్ ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

#PVT 04 గ్లింప్స్ రిలీజ్ పై క్లారిటీ