కేవలం డ్యాన్సులు చేసే హీరోయిన్ కాదని కంగనా రనౌత్ పై ఆర్ మాధవన్ ప్రశంసలు
తమిళం, హిందీ చిత్రాల్లో కనిపించే ఆర్ మాధవన్, తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంగనా గురించి గొప్పగా మాట్లాడాడు మాధవన్. తను నటించిన సినిమాలు అన్నింటింలోనూ హీరోయిన్ల పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని, వాళ్ళంతా కేవలం డ్యాన్సులు చేసి, ఆ తర్వాత మాయమైపోవడానికి రాలేదని ఆర్ మాధవన్ తెలియజేసాడు. కంగనా రనౌత్ గురించి ఉదహరిస్తూ, ఆమె చాలా తెలివైన నటి అని, చేసే సినిమాలో వైవిధ్యం ఉండాలని కోరుకుంటుందనీ, అందుకే వివిధ జోనర్ సినిమాల్లో కనిపిస్తుంటుందని ఆర్ మాధవన్ అన్నాడు. ఒక్కోసారి కంగనా యాక్టింగ్ చూస్తే ఆశ్చర్యమేస్తుంటుందని అన్నాడు.
రెండు సినిమాల్లో కలిసి నటించిన కంగనా, ఆర్ మాధవన్
ఆర్ మాధవన్, కంగనా రనౌత్ కలిసి రెండు సినిమాల్లో నటించారు. 2011లో రిలీజైన తను వెడ్స్ మను, 2015లో రిలీజైన తను వెడ్స్ మను రిటర్న్స్ లో కనిపించారు. గతేడాది రాకెట్రీ - నంబి ఎఫెక్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆర్ మాధవన్. ఆ సినిమాకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆర్ మాధవన్, భోపాల్ గ్యాస్ ఉదంతంపై వస్తున్న సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు రైల్వేమెన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఇందులో, కీ.శే ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. ఇక కంగనా విషయానికి వస్తే, ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటిస్తుంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి