Game Changer: 'రా మచ్చా మచ్చా' సాంగ్ రిలీజ్.. తమన్ బీట్‌కి రామ్ చరణ్ మాస్ డాన్స్!
రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మెగా ఫ్యాన్స్‌కి సరికొత్త మసాలా అందించడానికి మేకర్స్ ఇవాళ 'రా మచ్చా మచ్చా' అనే రెండవ సింగిల్‌ను విడుదల చేశారు. తమన్ అందించిన సంగీతానికి రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులేశాడు. మొదటి లిరికల్‌తో 'జరగండి జరగండి' అంటూ ప్రేక్షకుల్లో జోష్ పెంచిన తమన్ ఈ సారి 'మచ్చా' అనే టైటిల్‌తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.
కిస్మస్ కానుకగా 'గేమ్ ఛేంజర్' రిలీజ్
డైరక్టర్ శంకర్ విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటలో ఆయన అమితమైన గ్రాండియర్‌ని చూపించారు. రచయిత అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను నకాష్ అజీజ్ పాడారు. స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాట కొరియోగ్రఫీ చేశారు. ఇది సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల అవుతుందని వార్తలొస్తున్నాయి. త్వరలో విడుదల తేదీపై స్పష్టత రానుంది.