LOADING...
David Reddy: 'డేవిడ్ రెడ్డి'లో మాస్ ట్రీట్.. మనోజ్‌తో స్టెప్పులేయనున్న రాశి ఖన్నా?
'డేవిడ్ రెడ్డి'లో మాస్ ట్రీట్.. మనోజ్‌తో స్టెప్పులేయనున్న రాశి ఖన్నా?

David Reddy: 'డేవిడ్ రెడ్డి'లో మాస్ ట్రీట్.. మనోజ్‌తో స్టెప్పులేయనున్న రాశి ఖన్నా?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

మంచు మనోజ్ ప్రధాన పాత్రలో హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డేవిడ్ రెడ్డి'. స్వాతంత్ర్యానికి ముందున్న కాలంలో జరిగిన ఒక వీరోచిత గాథను ఈ సినిమాతో వెండితెరపై చూపించబోతున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుడైన యోధుడు 'డేవిడ్ రెడ్డి' జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మొత్తం ఆ పాత్ర చుట్టూనే సాగుతుంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచే అంశాల్లో ఒకటి 'వార్ డాగ్' అనే ప్రత్యేక బైక్. సుమారు 700 కిలోల బరువుతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బైక్, మనోజ్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ఉపయోగపడనుంది. ఇక కథానాయికగా కోలీవుడ్‌లో హిట్ అయిన 'ప్రిన్స్' సినిమాలో నటించిన మరియా కనిపించనుంది.

వివరాలు 

రాశి ఖన్నా స్పెషల్ సాంగ్?

ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన సమాచారం ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమాలో ఒక మాస్ స్పెషల్ సాంగ్ (ఐటెం సాంగ్) ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాటలో మంచు మనోజ్‌తో కలిసి డ్యాన్స్ చేయడానికి టాలెంటెడ్ హీరోయిన్ రాశి ఖన్నాను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒక వైపు శక్తివంతమైన పీరియాడిక్ కథను ప్రేక్షకులకు అందించడంతో పాటు, మరో వైపు రాశి ఖన్నా స్పెషల్ సాంగ్ ద్వారా మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు ఆకర్షించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ నుంచి వస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement