LOADING...
Hari Hara Veeramallu: ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం.. ఇప్పుడు టికెట్ ధరల తగ్గింపు.. పవన్ మూవీ కొత్త స్ట్రాటజీ!
ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం.. ఇప్పుడు టికెట్ ధరల తగ్గింపు.. పవన్ మూవీ కొత్త స్ట్రాటజీ!

Hari Hara Veeramallu: ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం.. ఇప్పుడు టికెట్ ధరల తగ్గింపు.. పవన్ మూవీ కొత్త స్ట్రాటజీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే రెండో రోజు నుంచి కలెక్షన్లు కొంత మేర తగ్గుముఖం పట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా సినిమాలు విడుదలైన వెంటనే నిర్మాతలు అధికారికంగా కలెక్షన్లు ప్రకటించడం సర్వసాధారణం. కానీ ఈ చిత్రం విషయంలో ఇప్పటివరకు కలెక్షన్లపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా, విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Details

స్క్రీన్ బాల్కనీ టికెట్ ధర రూ.175

పవన్ కళ్యాణ్ యాక్షన్, నటన అభిమానులను ఆకట్టుకుంటున్నప్పటికీ.. సినిమా మరింత ప్రేక్షకులకు చేరాలనే లక్ష్యంతో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పెరిగిన టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం (జూలై 28) నుంచే ఈ తగ్గింపు అమలులోకి వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్ముల్లో సింగిల్ స్క్రీన్ బాల్కనీ టికెట్ ధర రూ.175గా, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.295గా చూపిస్తోంది. టికెట్ ధరల తగ్గింపు వల్ల ప్రేక్షకుల స్పందన పెరిగి, కలెక్షన్లపై సానుకూల ప్రభావం చూపుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Details

అభిమానుల్లో భారీ ఉత్సాహాం

పవన్‌ను యోధుడిగా చాలా కాలం తర్వాత వెండితెరపై చూడటం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా మెప్పించగా, బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. నోరా ఫతేహి, జిషు సేన్‌గుప్తా, సత్యరాజ్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎ.దయాకరరావు నిర్మాణంలో, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని సమర్పించారు.