
Baahubali: బాహుబలిని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్న రాజమౌళి.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం 'బాహుబలి' (Baahubali). ప్రభాస్ (Prabhas), రానా (Rana Daggubati), అనుష్క (Anushka Shetty), తమన్నా (Tamannaah Bhatia), రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి ప్రముఖ తారాగణం.. రాజమౌళి (SS Rajamouli) తీయగా తీసిన టేకింగ్, ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ - ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఒక గొప్ప విజయం వైపు నడిపించాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిన దానికి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు.
Details
ఒకే పార్ట్‌గా బాహుబలి..!
'బాహుబలి.. ఎన్నో ప్రయాణాలకు ఆరంభం.. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు.. ఎంతోమందికి స్ఫూర్తి..'' అంటూ తన ఎమోషన్స్ పంచుకున్న రాజమౌళి, ఇప్పుడు ఈ మహత్తర చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేశారట. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి కథను ఇప్పుడు ఒకే పార్ట్‌గా 'బాహుబలి: ది ఎపిక్ (Baahubali The Epic)' పేరిట విడుదల చేస్తున్నాం. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కాబోతోందంటూ పేర్కొన్నారు. ఈసారి కూడా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Details
మళ్లీ చరిత్ర రాస్తాడా బాహుబలి?
రీరిలీజ్‌కు సిద్ధమైన బాహుబలి.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేటకు బయలుదేరుతాడని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ఓ మోస్ట్ అవైటెడ్ రీరిలీజ్‌గా ఇది నిలవనుందని అంచనా.
Details
వైరల్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ 'బాహుబలివస్తున్నాడు'
బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో #బాహుబలివస్తున్నాడు అనే తెలుగు హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, పాటలు, డైలాగ్స్, BTS ఫుటేజ్ అన్నీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇదే హ్యాష్‌ట్యాగ్‌ను 2015లో మొదటగా రాజమౌళినే ఉపయోగించారనే విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ఆపోస్టును కూడా వైరల్ చేస్తున్నారు.