
SSMB29: రాజమౌళి- మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనా ..?
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి తన సినిమాలు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో మాత్రమే తెరకెక్కించారు. అయితే, ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో 'SSMB29' ప్రాజెక్ట్ ద్వారా కొత్త చాప్టర్ ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు కొనసాగుతున్నాయి అందుకే ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ జరుగుతోంది. ఇదే మహేష్ బాబు చేస్తున్న తొలి పాన్-ఇండియా చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టు చాలా స్పెషల్ గా ఉండే అవకాశం ఉంది.
వివరాలు
టైటిల్ ఎంపికపై సినీ పరిశ్రమలో చర్చలు
అయితే, ఈ స్పెషల్ మూవీకి టైటిల్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. మహేష్ బాబు ఇమేజ్‌కి సరిపడేల , పవర్ఫుల్ , క్యాచీగా ఉండే టైటిల్‌ను రాజమౌళి ఎంపిక చేస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కోసం 'వారణాసి' అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వెల్లడి అయ్యాయి. అయితే, రాజమౌళి-మహేష్ బాబు కలయిక అంటే టైటిల్ కూడా నెక్స్ట్ లెవల్ ఉంటుందని అందరూ అనుకున్నారు ఇలాంటి సందర్భంలో 'వారణాసి' వంటి సరళమైన టైటిల్ ఎంపికపై సినీ పరిశ్రమలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సస్పెన్స్‌కి తెరపడటానికి నవంబర్ 16 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే,ఆ రోజే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానున్నాయి.
వివరాలు
పూర్తయిన మహేష్,ప్రియాంక షూట్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. వారణాసి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఒక భారీ సెట్లో సినిమా షూట్ జరుపుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే, మహేష్, ప్రియాంక షూట్ పూర్తయింది.. వీఎఫ్ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.