
SSMB29: #ssmb29 నుండి మహేశ్ బాబు ప్రీ-లుక్ ఫోటో రిలీజ్.. సినిమా గురించి రాజమౌళి ఏమన్నారంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం #SSMB29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంపై అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్‌లో ఆశలు నెలకొన్నాయి. ఆ ఆశల మధ్య, అభిమానులను ఉద్దేశిస్తూ రాజమౌళి ప్రత్యేకంగా ఒక పోస్ట్ చేశారు. అందులో మహేశ్ బాబు ప్రీ-లుక్ ఫోటోను షేర్ చేస్తూ, పూర్తి లుక్‌ను 2025 నవంబర్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు.
వివరాలు
సినిమా చాలా భారీస్థాయిలో రూపుదిద్దుకుంటోంది: రాజమౌళి
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక అప్‌డేట్ వస్తుందని అభిమానులు ముందే ఊహించారు. వారికోసం రాజమౌళి స్పష్టమైన సందేశాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ.. "మేము ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించాం.మీ అందరి ఆసక్తి చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా భారీస్థాయిలో రూపుదిద్దుకుంటోంది. కేవలం ప్రెస్‌మీట్ నిర్వహించడం లేదా కొన్ని ఫొటోలు విడుదల చేయడం ద్వారా కథకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేము. అందుకే మేము దీన్ని అద్భుతంగా, విభిన్నంగా రూపొందిస్తున్నాం. మహేశ్ బాబు లుక్‌ను నవంబర్ 2025లో విడుదల చేస్తాం. ఇది ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది. మీ అందరి సహకారం, మద్దతు కొనసాగుతుందని నమ్ముతున్నాం" అని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజమౌళి చేసిన ట్వీట్
For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మహేశ్ బాబు ప్రీ-లుక్ ఫోటో
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025