LOADING...
Varanasi: రాజమౌళి కొత్త గేమ్‌ప్లాన్.. వారణాసి నుంచి ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ స్టార్ట్!
రాజమౌళి కొత్త గేమ్‌ప్లాన్.. వారణాసి నుంచి ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ స్టార్ట్!

Varanasi: రాజమౌళి కొత్త గేమ్‌ప్లాన్.. వారణాసి నుంచి ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ స్టార్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపే ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మైథాలజీ-టైమ్‌లైన్ థ్రిల్లర్ 'వారణాసి' 2027లో విడుదల కానున్నా... జక్కన్న మాత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ల దండయాత్ర ప్రారంభించారు. ఈసారి ఆయన టార్గెట్ ఇంటర్నేషనల్ ఆడియన్స్!

Details

ఏడాది ముందే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్

అసలు సినిమా లాంఛ్ ఈవెంట్‌ను కూడా రాజమౌళి గ్లోబల్ స్టేజ్‌గా మార్చేశారు. హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'వారణాసి' టైటిల్ లాంఛ్ ఈవెంట్‌కు అంతర్జాతీయ మాధ్యమాలు భారీ ఎత్తున హాజరయ్యాయి. అక్కడినుంచే జక్కన్న వరల్డ్‌వైడ్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు.

Details

రాజమౌళికి గ్లోబల్ గేమ్ ఛేంజర్

హాలీవుడ్‌లో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆమె వరల్డ్‌వైడ్ ఫేమ్‌ను రాజమౌళి పూర్తిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రియాంక, మహేష్ బాబు, విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి ఇంటర్నేషనల్ మీడియా ప్రమోషన్లను ప్రారంభించారు. నవంబర్ 18న ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు, క్యాప్షన్‌ దీనికే నిదర్శనం. "తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ఈ ఇద్దరు లెజెండ్లతో రాజమౌళి సినిమా కోసం పనిచేయడం నాకు పెద్ద గౌరవం. మూవీ రిలీజ్‌కు ఏడాది ముందే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ చేస్తున్నాం. మీడియా రియాక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. దేవుడి దయతో మీ అంచనాలను అందుకుంటాం. జై శ్రీరాం" అని ఆమె పేర్కొంది.

Details

రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ

బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఏర్పడింది. 'వారణాసి'తో ఆ క్రేజ్‌ను మరింత పెంచాలన్నది ఆయన లక్ష్యం. అందుకోసం ప్రియాంక చోప్రాను ప్రధాన ప్రమోషనల్ వెపన్‌లా ముందుకు తీసుకొస్తున్నారు. ఆమె గ్లోబల్ ఇమేజ్, హాలీవుడ్ పరిధి... 'వారణాసి'కి అంతర్జాతీయ స్థాయిలో భారీ అటెన్షన్ దక్కేలా చేస్తోంది. 2027 సమ్మర్‌కు గ్రాండ్ రిలీజ్ ఇప్పటికే లాంఛ్ ఈవెంట్ అంతర్జాతీయ చర్చకు దారి తీస్తుండగా... మిగిలిన మూడు సంవత్సరాలు కూడా రాజమౌళి వరల్డ్‌వైడ్ ప్రచారమే చేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. మహేష్ బాబు కొత్త లుక్, ప్రియాంక చోప్రా మాస్ అవతారం, పృథ్వీరాజ్ శక్తివంతమైన పాత్ర... ఇవన్నీ కలిపి 'వారణాసి'పై గ్లోబల్ లెవల్ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.