LOADING...
TheRajaSaab : 'రాజాసాబ్' సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. చెన్నైలో ప్రత్యేక ఈవెంట్
'రాజాసాబ్' సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. చెన్నైలో ప్రత్యేక ఈవెంట్

TheRajaSaab : 'రాజాసాబ్' సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. చెన్నైలో ప్రత్యేక ఈవెంట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్దికుమార్‌ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా, ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ రెండో లిరికల్ సాంగ్ విడుదలకు సిద్ధమవుతున్నారు.

Details

డిసెంబర్ 18న రిలీజ్

ఈ సెకండ్ సింగిల్ కోసం చెన్నైలో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ గురువారం, అంటే డిసెంబర్‌ 18న రెండో లిరికల్ సాంగ్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు తమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉండబోతుందని సమాచారం. మొదటి లిరికల్ సాంగ్‌లో ప్రభాస్ చేసిన డాన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 'వింటేజ్ ప్రభాస్‌ను మళ్లీ చూశాం' అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాబోయే రెండో లిరికల్ సాంగ్‌లో కూడా డార్లింగ్ క్యూట్ లుక్స్‌లో దర్శనమివ్వనున్నాడని టాక్. చెన్నైలో జరగనున్న ఈ ఈవెంట్‌కు ప్రభాస్ స్వయంగా హాజరయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

Advertisement