LOADING...
Rajashekhar: రేలంగి మామయ్య పాత్రలో రాజశేఖర్‌?..ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో
రేలంగి మామయ్య పాత్రలో రాజశేఖర్‌?..ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో

Rajashekhar: రేలంగి మామయ్య పాత్రలో రాజశేఖర్‌?..ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో

వ్రాసిన వారు Moogati Shabari
Mar 25, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాల గురించి చెప్పుకుంటే ముందుగా గుర్తుకు వచ్చే చిత్రాల్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒకటి. ఈ సినిమాలో అన్నదమ్ములుగా వెంకటేష్, మహేష్ బాబు తమ నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. అలాగే వారి తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ కూడా తన ప్రత్యేకమైన నటనతో గుర్తింపు పొందారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సానుకూలంగా ఆలోచించే రేలంగి మామయ్య పాత్రకు మొదటగా దర్శక నిర్మాతలు రాజశేఖర్‌ను ఎంపిక చేయాలని భావించారు. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల కారణంగా ఆయన ఆ పాత్రలో నటించే అవకాశం కోల్పోయారు. ఈ విషయాన్ని రాజశేఖర్‌ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వివరాలు 

తండ్రి పాత్రలో రాజశేఖర్

రాజశేఖర్ మాట్లాడుతూ..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఒక పాత్ర కోసం తనను సంప్రదించారన్నారు. తన నవ్వు ఆ పాత్రకు సరిపోతుందని భావించి, తాను చేస్తే బాగుంటుందని అడిగారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయానని చెప్పారు. ఆ పాత్ర చేయలేకపోయినందుకు ఎప్పుడైనా బాధపడ్డారా అనే ప్రశ్నకు ఆయన అలాంటి అనుభూతి లేదని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు రాజశేఖర్‌ 'బైకర్‌' సినిమా ప్రమోషన్‌లలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో హీరో శర్వానంద్‌కు తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అభిలాష్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ చిత్రం ఏప్రిల్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement