LOADING...
Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్‌.. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
హాలీవుడ్ అవార్డ్ రేసులో భారత ఏకైక చిత్రం

Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్‌.. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 12, 2023
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ పేరు చెబితే అభిమానుల గుండెల్లో పూనకాలే. అశేష అభిమానంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఇండియన్ స్టార్ హీరో 73వ పుట్టిన రోజు నేడు. శివాజీరావు గైక్వాడ్‌'గా ఆర్టీసీ బస్‌ కండక్టర్‌గా జీవిత ప్రయాణం ప్రారంభించిన రజినీ సినిమాల్లోకి వచ్చాక జీవితమే మారిపోయింది. ఎంతలా అంటే తాను రోడ్ల మీద వచ్చి నిల్చుంటే క్షణాల్లో వేలాది మంది,నిమిషాల్లో లక్షలాది మంది జనం పొగయ్యేలా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్‌ 1975లో శివాజీరావును కాస్త రజనీకాంత్‌గా మార్చి నటుడిగా మరోజన్మను అందించారు. ఈ మేరకు అపూర్వరాగంగల్‌ చిత్రంతో ప్రతినాయకుడిగా రంగప్రవేశం చేశారు రజనీకాంత్‌. అనంతరం హీరోగా మారి స్వయంశక్తితో ఎదుగుతూ వచ్చారు.

Details

ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌ స్టార్‌గా మారిన రజనీకాంత్

ఈ క్రమంలోనే ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌ స్టార్‌గా దీదీప్యమానంగా వెలిగిపోతున్నారు. మధ్యలో రాజకీయాల వైపు అడుగులు ప్రారంభించినా తన స్వభావానికి సరితూగదని భావించారు. దీంతో వెనక్కి తగ్గారు. ఇక తనకంటూ మిగిలింది అభిమానులను అలరించడమేనని మరోసారి నిర్ణయించుకుని సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. జైలర్‌ చిత్రంతో రజనీకాంత్‌ మరోసారి ఫామ్'లోకి వచ్చారు. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్‌ సలామ్‌ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రజినీ 170వ చిత్రాన్ని ప్రారంభించారు. జై భీమ్‌ చిత్రం ఫేమ్, డెరెక్టర్ టీజే జ్ఞానవేల్‌ కథను అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మాణ బాధ్యతలను నిర్వహించనుంది. అనిరుద్‌ బాణీలను సమకూర్చుతున్నారు.

details

డిసెంబర్ 12న రజినీ అభిమానులకు పండుగ

ఈ భారీ చిత్రానికి సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. డిసెంబర్‌ 12న ఇవాళ రజనీకాంత్‌ 73వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పండుగ రోజుగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తలైవా ఫ్యాన్స్ రజనీకాంత్‌ పుట్టిన రోజు పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదే సమయంలో ఈసారి బర్త్ డే గిఫ్ట్'గా రజనీకాంత్‌ తమకు ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలకు సంబంధించి కొత్త విషయాలను ప్రకటిస్తారా లేక 171వ చిత్రానికి సంబంధించి తాజా వివరాలను అందిస్తారా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.