Gukesh: గుకేశ్‌ను సన్మానించిన రజనీకాంత్, గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసిన శివకార్తికేయన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ఇప్పుడు సినీ ప్రముఖులతో ప్రత్యేకమైన క్షణాలను గడిపారు.
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నివాసానికి వెళ్లిన గుకేశ్ ఆయనతో సంతోషంగా సమయాన్ని గడిపారు.
గుకేశ్ ఈ ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకుంటూ, మీతో గడిపిన సమయం నా జీవితంలో ప్రత్యేకం. ధన్యవాదాలు సర్! అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
చెన్నైలో రజనీకాంత్ తన నివాసంలో గుకేశ్‌ను ఆత్మీయంగా స్వాగతించారు. తన శైలి ప్రకారం రజనీకాంత్ గుకేశ్‌కు ఒక ప్రత్యేక పుస్తకాన్ని బహుమతిగా అందించారు.
Details
సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
'అమరన్' చిత్రంతో మరో విజయాన్ని నమోదు చేసిన శివకార్తికేయన్‌ను కూడా గుకేశ్ కలిశారు.
తన అభిమాన నటుడితో గడిపిన క్షణాలను గుకేశ్ ఎంతో ఉత్సాహంగా అభివర్ణించారు. శివకార్తికేయన్ గుకేశ్‌కు ఓ విలువైన వాచ్‌ను బహుమతిగా అందించి, అతడి విజయానికి అభినందనలు తెలియజేశారు.
రజనీకాంత్, శివకార్తికేయన్‌తో గుకేశ్ గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, అభిమానులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
గుకేశ్ ప్రతిభపై సినీ ప్రముఖుల నుంచి వస్తున్న ప్రశంసలు మరోసారి ఈ యువ గ్రాండ్ మాస్టర్ విజయాన్ని చాటిచెప్పాయి.