
Coolie OTT : ఓటీటీలోకి రజినీ కాంత్ 'కూలీ'.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్ట్ 14న పాన్-ఇండియా స్థాయిలో విడుదలైన 'కూలీ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా, థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదన్నది ఫ్యాన్స్ అభిప్రాయం. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా, రజనీకాంత్‌కు తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయిందన్న కామెంట్స్ వినిపించాయి. లాజిక్‌కు అందని కథనం, రజినీకి హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం అభిమానులను నిరాశ పరిచింది. లోకేష్ కనగారాజ్ యూనివర్స్‌లో గత మూడు సినిమాలు కల్ట్‌గా నిలిచినా, "కూలీ" మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయిందన్న టాక్ వచ్చింది.
Details
రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు
అయినా కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యి రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి, తమిళనాడులో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్‌కు ముందే ఈ సినిమా రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్నప్పటికీ, సెప్టెంబర్ 11న పాన్-ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ అయిన 28 రోజులకే ఓటీటీలోకి రానుంది 'కూలీ'. ఈ విషయంపై అధికారిక ప్రకటన మరో కొన్ని రోజుల్లో వెలువడనుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా స్పందన రాబడుతుందో చూడాల్సి ఉంది.